వంద రోజుల తర్వాత మా పప్పులు ఉడకడం కాదు బిర్యానీ కూడా ఉడుకుతుంది : బండ్ల గణేశ్ - bandla fires brs
🎬 Watch Now: Feature Video
Published : Jan 8, 2024, 3:38 PM IST
Cong Leader Bandla Ganesh fires on KTR : రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో నెల రోజుల పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు చూసి ఓర్వలేకపోతున్నారని కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్, హరీష్ రావుకి ఈర్ష్య పీక్ స్టేజ్‌కి చేరిందన్నారు. వందరోజుల తర్వాత కాంగ్రెస్ పప్పులు ఉడకవని వ్యాఖ్యనించిన హరీశ్‌రావుపై వ్యంగ్యంగా, మా పప్పులు ఉడకడం కాదు బిర్యాని కూడా ఉడుకుతుందని బండ్ల గణేశ్ కౌంటర్ చేశారు.
ఈ పది సంవత్సరాలు బీఆర్ఎస్ నాయకులు ఏం చేశారని, తెలంగాణకు రావలసిన హామీలపై ఎప్పుడైనా కేంద్రంతో కొట్లాడారా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి, మంత్రులు దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో మాట్లాడుతూ తెలంగాణకి రావలసిన నిధులు పోరాటం చేస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి అవినీతి అధికారులను పక్కకు తప్పించి నిజాయితీ అధికారులను నియమించుకొని పరిపాలన చేస్తున్నారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలవదని బండ్ల గణేశ్ స్పష్టం చేశారు.