రేవంత్‌ అన్నా మీతో మాట్లాడాలి - ఒక్క పిలుపుతో స్పందించి సమస్య పరిష్కరించిన సీఎం - యశోద ఆస్పత్రిలో సీఎం రేవంత్ రెడ్డి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 10:51 AM IST

Updated : Dec 11, 2023, 11:23 AM IST

CM Revanth Reddy Video Viral at Yashoda Hospital : ఒకవైపు ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరమే ఉంటుందని విమర్శలు చేస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం విమర్శలను పట్టించుకోకుండా ప్రజల వద్దకే పరిపాలన అంటూ పాలన సాగిస్తున్నారు. ప్రజలు ఆపదలో ఉండి పిలిస్తే పలుకుతానని అంటూ ముందుకు సాగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రోజున హైదరాబాద్​ యశోద ఆస్పత్రిలో మాజీ సీఎం కేసీఆర్​ను పరామర్శించి తిరిగి వెళ్తుండగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. 

CM Revanth Responded Grievance of Common People Issue :  కేసీఆర్​ను పరామర్శించి వెళ్తుండగా  'రేవంత్‌ అన్నా మీతో మాట్లాడాలి' అంటూ ఓ మహిళ సీఎంను అభ్యర్థించారు. ఆమె పిలుపుతో వెంటనే వెనక్కు తిరిగిన రేవంత్ ఆ మహిళ వద్దకు వెళ్లారు. ఆమె సమస్య ఏంటో చెప్పాలని అడిగారు. తన తండ్రి చికిత్సకు చాలా ఖర్చు అవుతోందని సాయం చేయాలని కోరారు. వెంటనే సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రేవంత్ ప్రవర్తించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Last Updated : Dec 11, 2023, 11:23 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.