బీఆర్‌ఎస్‌ మళ్లీ గెలిస్తే-పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం : సీఎం కేసీఆర్‌

🎬 Watch Now: Feature Video

thumbnail

CM KCR BRS Praja Ashirvada Sabha at Parigi : బీఆర్‌ఎస్‌ మళ్లీ గెలిస్తే.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణను దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా చేయడమే తన లక్ష్యమన్నారు. వికారాబాద్‌ జిల్లా పరిగి నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని.. ప్రసంగించారు. తాను ఏనాడు పదవుల కోసం కొట్లాడటం లేదని.. ప్రజల దయ వల్లే ఇప్పటికే రెండుసార్లు సీఎం అయ్యాయని తెలిపారు.

ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఆగం కావొద్దనేది తన తాపత్రయమని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మిషన్‌ మోడ్‌లో పేదలకు ఇళ్లు నిర్మిస్తామన్నారు. తాను ఉన్నంతవరకు బీఆర్‌ఎస్‌ ముమ్మాటికీ సెక్యులర్‌ పార్టీనే అని సీఎం కేసీఆర్‌ వివరించారు. ఎస్సీలు, ఎస్టీలను కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని ఆరోపించారు. 

CM KCR Election Campaign 2023 : ఎస్సీలందరూ ధనికులు అయ్యే వరకు దళితబంధు కొనసాగుతుందని కేసీఆర్‌ ఈ సందర్భంగా చెప్పారు. కులవృత్తులను ప్రోత్సహించడానికి గొర్రెలు, చేప పిల్లలు పంపిణీ చేశామన్నారు. ఇలా ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ.. అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నామన్నారు. కానీ కాంగ్రెస్‌ వాళ్లు మాత్రం 58 ఏళ్లు గోస పెట్టి తెలంగాణను ఊడగొట్టారని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.