Clashes Between MLA Mynampally and BJYM Followers : రాక్ ల్యాండ్ అవెన్యూ భూ కబ్జా.. ఎమ్మెల్యే మైనంపల్లి, బీజేవైఎం కార్యకర్తల మధ్య గొడవ - రాక్ ల్యాండ్ అవెన్యూలో భూములు కబ్జా ఇస్యూ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2023, 4:39 PM IST

Clashes Between MLA Mynampally and BJP Followers : భూములు కబ్జా విషయంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బీజేవైఎం కార్యకర్తల మధ్య గొడవకు దారితీసింది. ఈ దాడిలో బీజేవైఎం నాయకులు గాయపడ్డారు. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనంపల్లి హనుమంతరావు వర్గానికి చెందిన కొంత మంది వ్యక్తులు సికింద్రాబాద్​లోని రాక్ ల్యాండ్ అవెన్యూలో భూములు కబ్జా చేశారని బీజేవైఎం నాయకులు(BJYM Leaders) ఆరోపించారు. మైనంపల్లి అనుచరులు కబ్జా చేశారని.. దీంతోనే ఎమ్మెల్యే భవనాలు కట్టారని తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేవైఎం నాయకులను బాధితులు ఆశ్రయించారు. దీంతో మైనంపల్లి హనుమంతరావు కార్యకర్తలు బీజేవైఎం కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. 

BJYM Leaders Clash in Hyderabad : బీజేవైఎం కార్యకర్తలు కూడా రాక్​ల్యాండ్​ అవెన్యూ ఆఫీసు అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం బీజేవైఎం నేతలు జేసీబీతో వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కార్యాలయాన్ని ధ్వంసం చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఎమ్మెల్యే అనుచరులు అక్కడికి చేరుకొని బీజేవైఎం నాయకులపై దాడికి పాల్పడ్డారు. వారు విచక్షణారహితంగా కార్యకర్తలపై దాడి చేశారు. ఈ ఘర్షణలో పలువురు బీజేవైఎం కార్యకర్తలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.