బోధన్ నియోజకవర్గం ప్రచారంలో ఘర్షణ - పోలీసుల లాఠీఛార్జ్ - బీఆర్ఎస్ న్నికల ప్రచారం 2023
🎬 Watch Now: Feature Video
Published : Nov 22, 2023, 4:53 PM IST
Clash between Parties Activists in a Election Campaign : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్నీ పార్టీలు ప్రచారం జోరుగా చేస్తున్నాయి. పార్టీ అగ్ర నేతలతో సైతం నాయకులు ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడక్కడ అధికార పార్టీ నాయకుల, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సాటాపూర్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య పరస్పర దాడులు జరిగాయి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. సాటపూర్ గ్రామానికి చేరుకున్న సమయంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసుల బలగాలు చేరుకొని.. ఆందోళనకారులపై లాఠీ ఛార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు జరగలేదని పోలీసులు తెలిపారు.