Chikoti on Personal Security Guards Arrest : వ్యక్తిగత భద్రతా సిబ్బంది అరెస్ట్.. చీకోటి రియాక్షన్ ఇదే - Chikoti reacted in personal security arrest
🎬 Watch Now: Feature Video
Chikoti Praveen Reacted on Personal Security Guards Arrest : బోనాల పండుగ సందర్భంగా చీకోటి ప్రవీణ్ లాల్‌దర్వాజ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది గన్‌తో ఆలయంలోని వెళ్లే ప్రయత్నం చేశారు. భద్రతా సిబ్బంది వద్ద గన్‌ను గుర్తించిన దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం ఛత్రినాక పోలీసులకు అప్పగించారు.
దీనిపై చీకోటి ప్రవీణ్ స్పందించారు. పోలీసులు అత్యుత్సాహంతో తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. తన వ్యక్తిగత సిబ్బందికి గన్ లైసెన్స్ ఉందని చెప్పినా నిర్ధారించుకోకుండా.. పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు గన్‌లతో కూడిన వ్యక్తిగత భద్రత సిబ్బంది ఉన్నారనే విషయం అందరికీ తెలుసునని చెప్పారు. కానీ ఈరోజే పోలీసులు ఎందుకు ఇలా ప్రవర్తించారో తెలియడం లేదని వివరించారు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చీకోటి ప్రవీణ్ స్పష్టం చేశారు.