Chevella Ex MLA Ratnam Independent Competition : 'కార్యకర్తలు, అభిమానుల కోసం ఇండిపెండెంట్‌గా నిలబడతా' - చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఎన్నికల పోటీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 17, 2023, 5:38 PM IST

Chevella Ex MLA Ratnam Independent Competition : బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటన పూర్తి కావడం, వారికి బీ ఫారాలు కూడా అందిస్తుండటంతో.. అవకాశం లేని అసంతృప్తి నేతలు ప్రత్యామ్నాయాల వైపు దృష్టిపెడుతున్నారు. కొందరు ఇతర పార్టీల్లోకి వెళుతుండగా... కొందరు ఇండిపెండెంట్​గా పోటీకి సిద్ధమవుతున్నారు. తాజాగా చేవెళ్ల నియోజకవర్గం టికెట్‌ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. 

ఈసారి ఎన్నికల్లో పోటీ చేయమని అభిమానులు, తన అనుచరులు ఫోన్ చేస్తున్నారని తెలిపారు. వారి కోరిక మేరకు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకొని నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. నాకు రాజకీయ భిక్ష పెట్టిన చేవెళ్లను ఎప్పుడు వదిలి పెట్టనని తెలిపారు. స్థానిక సంస్థల్లో డబ్బులు తీసుకొని టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు.  ఈ ప్రాంత ప్రజల కోసం తన ప్రాణాలు ఉన్నంత వరకు అందుబాటులో ఉంటానని.. వారికి సేవ చేస్తానని తెలిపారు. సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవిలో ఉన్నా ఎనాడు టికెట్లు అమ్ముకున్న దాఖలాలు లేవని స్పష్టం చేశారు. తను వారి అడుగుజాడల్లో నడిచానని రత్నం తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.