అంతర్జాతీయ వేదికపై 'నాటు నాటు' పాట తెలుగు వాడి సత్తా చాటుతోంది: చంద్రబోస్ - ఆస్కార్ నాటు నాటు
🎬 Watch Now: Feature Video
ఈటీవీ పాడుతా తీయగా సెట్లో ఉండగా ఆస్కార్ శుభవార్త వినడం ఆనందంగా ఉందని గేయ రచయిత చంద్రబోస్ సంతోషం వ్యక్తం చేశారు. రాజమౌళి, కీరవాణిల కృషిలో భాగంగా ఉన్నందుకు సంతోషిస్తున్నట్లు తెలిపిన చంద్రబోస్.. దేవుడి దయవల్ల నాటునాటు పాటకు ఆస్కార్ వస్తే అందరికి పార్టీ ఇస్తానని చమత్కరించారు. పాడుతా తీయగా సెట్లోనే ఉన్న నేపథ్య గాయకులు సునీత, ఎస్పీ చరణ్ కూడా హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికగా నాటు నాటు పాట తెలుగు వాడి సత్తాను చాటడం గర్వకారణంగా ఉందన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST