'ఆస్కార్' వీరుడుకి స్వగ్రామంలో సత్కారం.. - ప్రఖ్యాత రచయిత ఆస్కార్ గ్రహిత చంద్రబోస్
🎬 Watch Now: Feature Video
Chandra Bose Couple Honored in Their Hometown: ఆస్కార్ బరిలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట అవార్డు గెలుచుకోవడంపై తెలుగు ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే సినీ గేయ రచయిత చంద్రబోస్ స్వగ్రామం అయినటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబోస్ ఆస్కార్ అవార్డు పొందిన తర్వాత తన స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా.. గ్రామస్థులు చంద్రబోస్ దంపతులకు ఘన స్వాగతం పలికారు.
డప్పు చప్పుళ్లు, మేల తాళాలతో గ్రామంలోకి స్వాగతం పలికారు. చల్లగరిగె గ్రామంలో చంద్రబోస్ ఇంటి పక్కనే ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత వేద ఆశీర్వచనం చేశారు. చంద్రబోస్ ఇంటి వద్ద చుట్టూ ఉన్న గ్రామాల నుంచి ప్రజలు, గ్రామస్థులు, బాల్యమిత్రులు, అభిమాన సంఘాల వారు, బంధువులు చంద్రబోస్ దంపతులను శాలువా, బోకెలతో సత్కరించారు. చంద్రబోస్ ఇన్నేళ్ల తన కెరీర్లో ఎన్నో పాటలతో ఉర్రూతలూగించారు. ఎన్నో పద ప్రయోగాలు సృష్టించి, పజల్ని మెప్పించారు. ఇప్పుడు.. ఆస్కార్ పొందిన తొలి తెలుగు సినీ గేయ రచయితగా నిలిచారు.
"ఈ సందర్భంగా రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. చల్లగరిగె గ్రామం తన ఊరని.. ఈ ఊరు తనకు ఎన్నో ఇచ్చింది. భారతదేశంలో మొట్టమొదటి ఆస్కార్ భారతదేశానీకే కాదు చల్లగరిగె గ్రామానికి కూడా వచ్చింది. జీవితంలో ఒకసారైన జాతీయ అవార్డు రావాలి అనుకున్నాను కానీ రాలేదు. ఇప్పటికీ 3600 పాటలు రాశాను. 4 ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చాయి. ఈ నాలుగు ఇంటర్నేషనల్ అవార్డుల బరువు 20 కేజీలు. ఈ 20కేజీల బాధ్యత బరువు నాపై మరింత పెరిగింది. నన్ను అభిమానించడానికి వచ్చిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. నేను చదివి పెంచుకున్న లైబ్రరీని పూర్తిగా నా సొంత ఖర్చులతో పునర్నిర్మాణం చేస్తాను". -చంద్రబోస్, ప్రఖ్యాత రచయిత ఆస్కార్ గ్రహిత