Car Hits Young Man Viral Video : రోడ్డు మధ్యలో విన్యాసాలు.. కారు ఢీకొని యువకుడు మృతి - రోడ్డు మధ్యలో యువకుడి విన్యాసాలు కారు ఢీకొని మృతి
🎬 Watch Now: Feature Video
Published : Oct 23, 2023, 5:04 PM IST
Car Hits Young Man Viral Video : రోడ్డు మధ్యలో విన్యాసాలు చేసిన యువకుడిని కారు బలంగా ఢీకొన్న ఘటన ఉత్తరాఖండ్ దెహ్రాదూన్ జిల్లాలోని రిషికేశ్‌లో జరిగింది. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ యువకుడు ఆస్పత్రిలో మృతి చెందాడు. బాధితుడిని శివమ్గా రిషికేశ్ పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబరు 11వ తేదీన రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితుడు శివమ్.. కాలినడకన ఇంటికి వెళ్తూ రోడ్డు మధ్యలో చిన్నపాటి విన్యాసాలు చేశాడు. ఎదురుగా వస్తున్న వాహనాలకు అడ్డంగా నిల్చున్నాడు. అదే సమయంలో హరిద్వార్ నుంచి వస్తున్న ఓ కారు అతడిని ఢీకొట్టింది.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. యువకుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శివమ్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి రిషికేశ్ ఎయిమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో స్థానికులు అతడిని ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. చికిత్స ప్రారంభించిన కాసేపటికే.. అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ప్రమాదం గురించి విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆస్పత్రికి చేరుకున్నారు. శివమ్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. బాధితుడి తల్లి సునీతా దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డవ్వగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.