సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ పార్కింగ్​లోని కారులో చెలరేగిన మంటలు - ప్రయాణికుల భయాందోళన - నానో కారులో మంటలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2023, 7:44 PM IST

Car Fire at Secunderabad Railway Station : రైల్వే స్టేషన్​కు కారులో వచ్చిన ప్రయాణికులు పార్కింగ్​లో​ కారు పెట్టి లోనికి వెళ్తారు. అలా ఓ ప్రయాణికుడు తన కారును పార్కింగ్​లో పెట్టాడు. అనంతరం ఒక్కసారిగా ఆ కారులో మంటలు చెలరేగాయి. దీంతో ప్రజలు భయపడి.. అగ్నిమాపక సిబ్బందికి తెలపగా.. వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ పార్కింగ్​ ప్రదేశం(Car Fire at Secunderabad Railway Station Parking)లో ఉన్న ఓ కారులో నుంచి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా కారు నుంచి మంటలు రావడంతో అక్కడ ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. 

Nano Car Fire Accident at Railway Station : కారులో వచ్చిన మంటలను చూసిన ప్రజలు.. వెంటనే అగ్నిమాపక సిబ్బిందికి సమాచారాన్ని తెలియజేశారు. తక్షణమే రైల్వేస్టేషన్​కు చేరుకుని వారు మంటలను అదుపు చేశారు. ఆ కారు గత కొన్ని రోజులుగా పార్కింగ్​లో ఉందని.. నానో రకానికి చెందిన కారుగా స్థానికులు తెలిపారు. ఆ కారు పూర్తి వివరాలపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్ని రోజుల నుంచి స్టేషన్​లో ఉంది.. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఏమిటి?.. అనే పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.