సబ్ ఇన్స్పెక్టర్గా ఏడేళ్ల బాలుడు - కలను సాకారం చేసుకున్న క్యాన్సర్ పేషెంట్ - క్యాన్సర్ పేషెంట్‌కి పోలీస్ డ్యూటీ
🎬 Watch Now: Feature Video


Published : Dec 15, 2023, 5:33 PM IST
Cancer Patient Charge as Police Officer : క్యాన్సర్‌తో బాధపడుతున్న ఏడేళ్ల బాలుడి పోలీసు కావాలనే కోరికను తీర్చేందుకు బంజారాహిల్స్ పోలీసులు అతడికి అధికారిగా అవకాశం ఇచ్చి కోరిక తీర్చారు. గుంటూరుకు చెందిన మోహన్ సాయి అనే బాలుడు గత సంవత్సరమే క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డాడు. హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఏడాదిగా చికిత్స పొందుతున్నాడు. ఆ చిన్నారికి పోలీసు కావాలని కోరిక ఉందని ఆసుపత్రి సిబ్బంది తెలుసుకుని, మేక్ ఏ విష్ ఫౌండేషన్ సభ్యుల ద్వారా చిన్నారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లారు.
One day Police chance to Cancer Patient : దీంతో అక్కడి సిబ్బంది చిన్నారిని సాదరంగా ఆహ్వానించి పోలీస్ అధికారిగా సీట్లో కూర్చోబెట్టారు. బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జాకీర్ హుస్సేన్ చిన్నారికి పోలీసు గౌరవ వందనం చేసి, చిన్నారి నుంచి కూడా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో జరిగే పని విధానం గురించి వివరించి బహుమతులను అందజేశారు.