శ్రీకృష్ణుడికి నైవేద్యంగా 812 రకాల పిండి వంటలు - శ్రీకృష్ణుడికి నైవేద్యం
🎬 Watch Now: Feature Video
భంజన్ ద్వాదశి సందర్భంగా పూరీలోని గురువిహార్ మఠంలో శ్రీకృష్ణుడికి 812 రకాల ప్రసాదాలను నివేదించారు. అధిక సంఖ్యలో భక్తుల విచ్చేసి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. 812 రకాల ప్రసాదాలను 20 కట్టెల పొయ్యిలపై తయారు చేసినట్లు మఠం నిర్వాహకులు తెలిపారు. ఏటా భంజన్ ద్వాదశి నాడు స్వామివారికి 500 రకాల ప్రసాదాలను సమర్పిస్తామని, ఈ ఏడాది రికార్డు స్థాయిలో ప్రసాదాలను నివేదించామని పేర్కొన్నారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడికి యశోద అనేక రకాల వంటకాలు పెట్టేదని, ఆ సంప్రదాయాన్ని కొనిసాగించేందుకు ప్రతీ సంవత్సం ఈ వేడుకను జరుపుకుంటున్నామని చెప్పారు.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST