బ్రేకులు ఫెయిల్, పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు - తప్పిన పెను ప్రమాదం - Bus Accident due to Brake Fail
🎬 Watch Now: Feature Video


Published : Jan 13, 2024, 6:58 PM IST
Bus Accident due to Brake Fail in Vikarabad : బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా బ్రేక్స్ పని చేయలేదు. దీంతో డ్రైవర్ కంట్రోల్ చేయాలని ప్రయత్నించాడు. చివరికి అది అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఉన్న పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది.
RTC Bus Accident at Ananthagiri : తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాాబాద్ నుంచి తాండూరుకు బయల్దేరింది. వికారాబాద్లో అనంతగిరి ఘాట్ రోడ్ వచ్చే సమయానికి అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో సుమారు 50 మందికి పైగా ప్రయాణికులు ఉండగా, 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులు 108కు, పోలీసులకు తెలియజేశారు. వెంటనే క్షతగాత్రులను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. పోలీసులు ప్రయాణికులను, డ్రైవర్ను విచారించి బస్సు బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించుకున్నారు. ఆ సమయంలో ఎదురుగా వాహనాలు రాకపోవడం, డ్రైవర్ అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు.