Bull Pair Sold Rs 1 Crore In Suryapet : జత గిత్తల ధర కోటి రూపాయలు.. వీడియో వైరల్ - జత గిత్తలు కోటి రూపాయలు
🎬 Watch Now: Feature Video
Bull Pair Sold Rs 1 Crore In Suryapet : పందెం గిత్తలు కోట్లు రూపాయలు పలుకుతున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కి చెందిన సుంకి సురేందర్ రెడ్డి.. తాను పెంచుకున్న గిత్తల్లో ఒక జతను కోటి రూపాయలకు అమ్మారు. బాపట్ల జిల్లా అనంతారం గ్రామానికి చెందిన రైతు రూ.కోటి చెల్లించి వాటిని సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గత తొమ్మిది నెలలో జరిగన 40కి పైగా పోటీల్లో ఈ గిత్తలు పాల్గొన్నాయి. అందులో 34 సార్లు ప్రథమ బహుమతిని గెలుచుకున్నట్లు ఆయన తెలిపారు. తాను చిన్నప్పటి నుంచి జంతు ప్రేమికుడినని.. తన ఇంట్లో 15 జతల ఎద్దులు ఉండేవని అందువల్ల వాటి పట్ల ప్రేమ పెరిగిందని తెలిపారు. ఈ రెండు జతల గిత్తలను ఇలా ఇప్పుడు అమ్మడం చాలా బాధగా ఉందని.. అయినా తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భీముడు, అర్జునుడుగా పిలుచుకునే ఈ రెండు గిత్తలు చిన్నప్పటి నుంచి తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నానని తెలిపారు.