RS Praveen kumar fires on KCR : "రైతు రుణమాఫీ అమలులో.. కేసీఆర్ విఫలం" - RS Praveen Kumar
🎬 Watch Now: Feature Video
BSP Yatra in Peddapally district : తెలంగాణ రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. శనివారం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో బహుజన రాజ్యాధికార యాత్ర ఉత్సాహంగా జరిగింది. ఎలిగేడు మండల కేంద్రంలో ప్రవీణ్‌కుమార్ బీఎస్పీ జెండాను ఆవిష్కరించి పార్టీ గీతాన్ని అలాపించారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీల మేరకు నేటికీ.. పంట రుణమాఫీ చేయలేదని గుర్తు చేశారు. ఫలితంగా చిన్న, సన్నకారు రైతులు బ్యాంకుల్లో.. అధికారులు పెట్టే నిబంధనలో భరించలేక విసిగిపోతున్నారని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు కోల్పోయిన రైతులకు నేటికీ పంట నష్టపరిహారం అందలేదని పేర్కొన్నారు. బీఎస్పీ నిర్వహిస్తున్న రాజ్యాధికార యాత్రలో రైతులు, సామాన్య ప్రజలు చెబుతున్న సమస్యలన్నింటిని విని.. భవిష్యత్తులో వారి సమస్యలు పరిష్కారాన్ని కృషి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు బీఎస్పీలోకి రావాలని పిలుపునిచ్చారు.