MLC Tata Madhu Fires on Venkatreddy : 'బీఆర్ఎస్ కార్యకర్తలు తలచుకుంటే కోమటిరెడ్డి బయట తిరగలేరు'
🎬 Watch Now: Feature Video
Tata Madhu Fires on Congress : ఖమ్మంలో జరిగింది జన గర్జన కాదు.. నాయకుల గర్జనేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు. కేసీఆర్ సర్కార్‌పై రాహుల్ గాంధీ చౌకబారు విమర్శలు.. పసలేని ఆరోపణలు చేశారని తాతా మధు మండిపడ్డారు. అధికారంలోకి వస్తే రూ.4000 పెన్షన్ ఇస్తామంటున్న కాంగ్రెస్ నేతలు.. వారు పాలించే రాష్ట్రాల పరిస్థితి చూసుకోవాలని హితవు పలికారు. జనగర్జన బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిది పార్టీ లైన్ కాదు.. వ్యక్తి స్వామ్యం మాత్రమేనని తాతా మధు ఆరోపించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేక కేసీఆర్‌పై విమర్శలు చేశారని మండిపడ్డారు.
ఈ క్రమంలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆర్ఎస్పై అవాకులు చవాకులు పేలుతున్నారని.. బీఆర్ఎస్ కార్యకర్తలు తలచుకుంటే కోమటిరెడ్డి బయట తిరగలేరని ధ్వజమెత్తారు. ఎన్నోసార్లు బీఆర్ఎస్లో చేరతానని కోమటిరెడ్డి వేడుకున్నారని తెలిపారు. వాస్తవాలను కప్పి ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఏ పార్టీకి బీ-టీమ్ కాదు.. సీ-టీమ్ కాదని స్పష్టం చేశారు.