'సీఎం రేవంత్ రెడ్డికి పంటల బీమాకు, రైతు బీమాకు తేడా తెలియదు' - సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
🎬 Watch Now: Feature Video
Published : Dec 16, 2023, 5:29 PM IST
BRS MLA KTR Fires on CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి పంటల బీమాకు, రైతు బీమాకు తేడా తెలియదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అలాంటి నాయకుడు మీ నాయకుడు అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా పీసీసీ అధ్యక్షుడిలా గాంధీభవన్లో కూర్చున్నట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పదేళ్లలో ఇసుకపై కేవలం రూ.39 కోట్ల ఆదాయమే వచ్చిందని ఎద్దేవా చేశారు.
Telangana Assembly Sessions 2023 : ఈ లెక్కన చూసుకుంటే సంవత్సరానికి రూ. 4 కోట్లు కూడా రాలేదు. కానీ 2014 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇసుకపై రూ.5 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. ఇసుక మాఫియా కాంగ్రెస్ పార్టీది కాదా అంటూ ఆరోపించారు. ఇసుక మాఫియాపై కాంగ్రెస్ 2018కి ముందు చెప్పింది ఆ తర్వాత చెప్పింది. ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది ఏ విచారణ చేసుకుంటారో చేసుకొండి అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.