ప్రజాస్వామ్యబద్ధంగా హామీలు అమలు చేయాలని కోరితే బీఆర్‌ఎస్‌పై నిందలా : వినయ్ భాస్కర్ - BRS Leader Vinay Bhaskar
🎬 Watch Now: Feature Video
Published : Jan 5, 2024, 5:08 PM IST
BRS Leader Vinay Bhaskar Press Meet at Hanamkonda : రానున్న పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్‌ఎస్ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొంత తేడాతో ఓడిపోయినప్పటికీ, ఓటమికి కుంగిపోకుండా పార్టీ పటిష్టత కోసం పని చేయాలని సూచించారు.
Vinay Bhaskar Comments on Congress Guarantees : కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని వినయ్ భాస్కర్ చెప్పారు. గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. ప్రజాస్వామ్యబద్ధంగా హామీలను అమలు చేయాలని కోరితే బీఆర్‌ఎస్‌పై నిందారోపణలు మోపడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరడంపై వినయ్ భాస్కర్ స్పందించారు. ఎవరు పార్టీ మారినా లక్ష్య సాధనలో వెనకడుగు వేయమని బీఆర్‌ఎస్ నేత వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పని చేద్దామని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.