thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2023, 6:36 PM IST

ETV Bharat / Videos

పాలేరులో బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌ రెడ్డి నామినేషన్

BRS Candidate Kandala Upender Reddy Nomination : రాష్ట్రంలో పార్టీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు జోరందుకున్నాయి. పాలేరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌ రెడ్డి ఇవాళ నామినేషన్‌ వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి భారీ మెజార్టీతో ఉపేందర్‌ రెడ్డి గెలు‌స్తారని నామ నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ఉపేందర్‌ రెడ్డి గత ఐదేళ్లుగా పాలేరు ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారని చెప్పారు. నియోజకవర్గంలో కందాల ఉపేందర్ రెడ్డి అన్ని రకాలుగా అభివృద్ధి చేశారన్నారు. పార్టీలకు అతీతంగా ఉపేందర్‌ రెడ్డిని ప్రజలు అభిమానిస్తారని తెలిపారు. 

పాలేరు ప్రజలను కందాల సొంత కుటుంబ సభ్యులుగా చూసుకున్నారని అన్నారు. వారి కోసం కందాల సొంత ఖర్చులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నామినేషన్ ప్రక్రియ ఈ నెల 10న ముగుస్తుంది. నవంబరు 13వ తేదీ వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 15 వరకు అవకాశం ఉంది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.