Boy Died After Falling In Water Tank Mahabubabad : పండుగపూట విషాదం.. నీటి సంపులో పడి మూడేళ్ల బాలుడు మృతి - నీటి సంపులో పడి బాలుడు మృతి2023

🎬 Watch Now: Feature Video

thumbnail

By Telangana

Published : Sep 2, 2023, 12:53 PM IST

Boy Died After Falling In Water Tank Mahabubabad : తోబుట్టువుకు రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్లిన మౌనిక జీవితంలో విషాధ ఛాయలు అలుముకొన్నాయి. తన మూడేళ్ల బాలుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇంటి ముందున్న నీటి సంపులో పడి మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో జరిగింది.

Tragedy in Rakhi Celebrations Mahabubabad  : ఖమ్మం జిల్లా ముత్తగూడెం గ్రామానికి చెందిన నాగరాజు -మౌనిక దంపతులకు కౌశిక్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. మౌనిక తన సోదరుడికి రాఖీ కట్టేందుకు తన కుమారుడిని వెంట తీసుకుని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని పుట్టింటికి వెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో కౌశిక్ ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో పక్కన ఉన్న నీటి సంపులో పడి బాలుడు మృతి చెందాడు. బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుగా వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి నీటి సంపులో చూశారు. సంపులో విగతజీవిగా పడి ఉన్న కౌశిక్​ను చూసి మౌనిక కన్నీరుమున్నీరుగా విలపించింది. వెంటనేక కుటుంబ సభ్యులు కౌశిక్​ను బయటకు తీసినా..​ అప్పటికే మృతి చెందడంతో ఆ కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.