Bonalu festival in Hyderabad : గోల్కొండ కోటలో బోనాల సంబురాలు - Telangana latest news
🎬 Watch Now: Feature Video
Bonalu festival in Hyderabad : ఆషాఢమాస బోనాలకు జంట నగరాలు ముస్తాబయ్యాయి. మొట్టమొదటగా గోల్కొండ అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలో కొలువైన జగదాంభిక అమ్మవారికి భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చి బోనాలు సమర్పించారు. ప్రతి ఏటా ఆషాడ మాసంలో ఈ పూజలు నిర్వహిస్తారు. తొమ్మిది వారాల పాటు అమ్మవారికి ధూప, ధీప నైవేధ్యాలను.. ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు సమర్పిస్తారు. తెల్లవారుజామున ఆరు గంటల నుంచే బోనాల సమర్పణ ప్రారంభమైంది.
ఇతర జిల్లాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి బోనాల జాతరలో పాల్గొంటున్నారు. అమ్మా బైలెల్లినాదో.. తల్లి బైలెల్లినాదో.. అంటూ భక్తుల కోలాహలం మధ్య అమ్మవారి బోనాల పండుగ మొదలైంది. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, డోలు వాయింపులతో కోట కళకళలాడుతోంది. ప్రజలు భక్తి శ్రద్ధలతో కుండ, రాగి పాత్రలలో నైవేథ్యం వండి అమ్మవారికి సమర్పించారు. ఆషాఢ బోనాల ఉత్సవాలతో నెల రోజుల పాటు జంట నగరాలు సందడిగా మారనున్నాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.