Boath MLA Bapu Rao Cheating Case Registered : బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుపై చీటింగ్ కేసు నమోదు - Cheating Case on BRS MLA Rathod Bapu Rao
🎬 Watch Now: Feature Video
Published : Oct 18, 2023, 9:20 PM IST
Boath MLA Bapu Rao Cheating Case Registered : ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుపై చీటింగ్ కేసు నమోదైంది. ఆదిలాబాద్ పట్టణ పరిధిలోని బట్టి సావర్గం శివారులో 2012లో సుదర్శన్ అనే స్థిరాస్తి వ్యాపారితో కలిసి ఓ వ్యక్తికి రెండు ఇంటి స్థలాలను విక్రయించారని.. అనంతరం అవే ప్లాట్లను 2019 మరో వ్యక్తికి అమ్మారని ఆరోపణలు వచ్చాయి. ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకున్నారని.. బాపురావును ఆశ్రయించినప్పటికీ పట్టించుకోవడం లేదని బాధితులు తెలిపారు. దీంతో బాధితుల్లో ఒకరైన ఖండేస్కర్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు.
Cheating Case on BRS MLA Rathod Bapu Rao : తనను బాపూరావు మోసం చేశారని ఆరోపించారు. దీంతో జ్యుడిషియల్ కోర్టు విచారణకు ఆదేశించడంతో అదిలాబాద్‌లోని టూటౌన్‌లో పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే బాపురావు సహా సుదర్శన్‌పై పలు సెక్షన్ల( 409, 420 , 421) కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్లు టూ టౌన్ సీఐ అశోక్ తెలిపారు.