Blood Donation Camp at Engineering College : ఆ వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం చేసిన 300మంది విద్యార్థులు.. ఎక్కడంటే.?
🎬 Watch Now: Feature Video
Blood Donation Camp in Rangareddy: యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమి లేదు. యువత ముందుకు నడిస్తే సమాజంలో చాలా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. తాజాగా తలసేమియా, క్యాన్సర్ రోగులకు బ్లడ్ కోసం ఓ ఇంజినీరింగ్ విద్యార్థులు రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని బడంగ్ పెట్ మున్సిపాలిటీ పరిధి ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. ఇందులో 300 పైగా విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. వారి నుంచి సేకరించిన బ్లడ్ యునిట్స్ని నారాయణ్‌పేట్‌లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పంపించారు.
ఈ క్యాంప్‌లో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనడం ఆనందంగా ఉందని ఐ ఫౌండేషన్ అధ్యక్షులు సుతారపు రవీందర్ అన్నారు. రక్తదానం చేసిన విద్యార్థులను అభినందించారు. గత కొంత కాలంగా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు తమ పౌండేషన్ ద్వారా చేశామని తెలిపారు. ఇక్కడ సేకరించిన రక్తాన్ని తలసేమియా, క్యాన్సర్‌తో బాధుపడుతున్న రోగుల కోసం ఉపయోగించనున్నట్లు చెప్పారు. బ్లడ్ బ్యాంక్ కాకుండా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు.