'షుగర్ ఫ్యాక్టరీ భూముల్ని అమ్మకానికి పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం' - సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు
🎬 Watch Now: Feature Video
Published : Nov 21, 2023, 6:58 PM IST
BJP MP Arvind comments on BRS : తెలంగాణలో పసుపు బోర్డు తెచ్చిన ఘనత బీజేపీదని, ఆ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ కుటుంబాన్ని కారాగారంలోకి పంపుతామని ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణంలో యువశక్తి విజయ సమ్మేళనం కార్యక్రమనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడారు. బోధన్ బీజేపీ అభ్యర్థి వడ్డి మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని ప్రజల్ని కోరారు. బోధన్‌లో చక్కెర కర్మాగారం ప్రారంభించడం బీజేపీ పార్టీతోనే సాధ్యం అని.. దీన్ని రైతులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుత ఎమ్మెల్యే షకీల్ అక్రమాలకు ముగింపు పలకాలంటే బీజేపీ అభ్యర్థి మోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ అరవింద్ కోరారు. తెలంగాణలో షుగర్ ఫ్యాక్టరీ భూములను అమ్మడానికి కేసీఆర్ ప్రభుత్వం అనుమతించిందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి, కేసీఆర్ కంటే వేగంగా ప్రభుత్వ భూములను అమ్మేస్తారని విమర్శించారు. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు నెలలకోసారి ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.