బండి సంజయ్‌ని కోర్టులో హాజరుపరిచే క్రమంలో ఉద్రిక్తత పరిస్థితులు - హనుమకొండ వార్తలు
🎬 Watch Now: Feature Video
మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు భారీ బందోబస్తుతో అరెస్ట్ చేశారు. దీనిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. బండి సంజయ్‌ని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సంజయ్‌ని హనుమకొండ కోర్టుకు తీసుకురానున్నట్లు సమాచారం అందడంతో బీజేపీ నాయకులు అక్కడకి చేరుకున్నారు. దీంతో జిల్లా కోర్టు దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
బీజేపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, ఆందోళనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. నిరసనకారులను అదుపులోకీ తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. తమను కోర్టులోకి వెళ్లనివ్వాలంటూ సంజయ్ తరఫు న్యాయవాదులు కోర్టు వద్ద నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు కోర్టు ప్రాంగణం గేటుకు తాళాలు వేశారు. దీంతో కోర్టు ప్రాంగణం వద్ద లాయర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. కోర్టు ప్రాంగణంలోకి అనుమతించకపోవడంతో బండి సంజయ్ తరఫు న్యాయవాదులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.