కాంగ్రెస్ నాయకులు అయోధ్యను దర్శించుకోకపోతే పోయేదేమీ లేదు : డీకే అరుణ - DK Aruna fire on Congress
🎬 Watch Now: Feature Video
Published : Jan 13, 2024, 6:36 PM IST
BJP Leader DK Aruna Comments on Congress : అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ మహాత్కార్యాన్ని అందరూ మరుపురాని రోజుగా భావిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజకీయాలకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కులంతో, మతంతో కూడుకున్నదని విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి ఆమె బహుమతులు ప్రదానం చేశారు.
DK Aruna About Ayodhya Ram Mandir : ఈ సందర్భంగా డీకే అరుణ అయోధ్య రామ మందిరం గురించి మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. శ్రీరాముడు ఉన్నాడని అనుకునే వారు అయోధ్య దర్శనం చేసుకుంటారని, కాంగ్రెస్ నాయకులు దర్శించుకోకపోతే పోయేదేమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకునేందుకు ఈ నెల 23 నుంచి ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పిస్తుందని పేర్కొన్నారు.