BJP corporators meet on governor : ' బాయ్‌కాట్ చేసిన అధికారులను సస్పెండ్ చేయాలి' - Clash in GHMC council meeting
🎬 Watch Now: Feature Video
Officials boycott GHMC meeting : జీహెచ్ఎంసీ కౌన్సిల్‌ను బహిష్కరించిన అధికారులను సస్పెండ్ చేయాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. వెంటనే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. ఈ మేరకు బీజేపీ కార్పొరేటర్లు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఇటీవల కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా ముగియడం పట్ల ఆందోళన చెందిన గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు కార్పొరేటర్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని కోరిన బీజేపీ నేతలు మీటింగ్‌ను బహిష్కరించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని విన్నవించారు. అధికారులపై చర్యలు తీసుకుంటామని గవర్నర్ హామీ ఇచ్చారని తెలిపారు.
"జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ గత రెండున్నర ఏళ్లలో ఆరు సార్లు జరిగింది. ఒక్క సారి కూడా అజెండా పూర్తి కాలేదు. గట్టిగా అడిగితే మేయర్ బయటకు వెళ్లిపోతారు. సభను వాయిదా వేస్తారు. మా కార్పొరేటర్లు జలమండలి అధికారులను కొన్ని ప్రశ్నలు వేశారు. దానికి వారు సమాధానం చెప్పలేక బాయ్‌కాట్ చేశారు. మేయర్‌కు కనీసం వారికి సర్దిచెప్పి కూర్చోబెట్టాలనే ఆలోచన కూడా లేదు. మీటింగ్ బహిష్కరించిన అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలి".- బీజేపీ కార్పోరేటర్లు