అయోధ్య రామయ్యకు హైదరాబాద్ నుంచి 1265 కిలోల భారీ లడ్డు
🎬 Watch Now: Feature Video
Big Laddu Sent From Hyderabad To Ayodhya : అయోధ్య రామయ్యకు హైదరాబాద్ నుంచి మరో కానుక అందనుంది. ప్రాణప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకుని అత్యంత భక్తి శ్రద్దలతో తయారు చేసిన భారీ లడ్డూను అయోధ్యకు తరలివెళ్లింది. ఈ అద్భgత ఘడియలకు గుర్తుగా సికింద్రాబాద్కు చెందిన శ్రీరామ్ క్యాటరర్స్ 1,265 కిలోల భారీ లడ్డూను తయారు చేసి అయోధ్య రామయ్యకు కానుకగా సమర్పించాలని సంకల్పించారు. అయోధ్య రామయ్యకు సమర్పించేందుకు హైదరాబాద్ లడ్డూ బయలు దేరింది.
Nagabhushan Reddy Made 1,265Kg Laddu : శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నుంచి అతిపెద్ద లడ్డూ తయారీ చేసేందుకు సికింద్రాబాద్కు చెందిన శ్రీరామ్ క్యాటరర్స్ వారు అనుమతి తీసుకున్నారు. ఈ లడ్డూ తయారీకి 350 కిలోల శనగపిండి, 700 కిలోల చక్కెర, 40 కిలోల నెయ్యి, 40 కిలోల కాజులు, 30 కిలోల కిస్మిస్లు, 30 కిలోల బాదం, 10 కిలోల పిస్తా, 32 గ్రాముల కుంకుమ పువ్వు వినియోగించినట్లు నాగభూషణం రెడ్డి వెల్లడించారు. ఈ లడ్డూను రాముడి గుడికి 50 మీటర్ల దూరంలో ప్రదర్శనకు ఉంచుతారని, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచుతారని నాగభూషణం రెడ్డి పేర్కొన్నారు.