80 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు-తప్పదు భారీ మెజార్టీ : భట్టి విక్రమార్క - 80 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్న భట్టి
🎬 Watch Now: Feature Video


Published : Nov 22, 2023, 7:56 PM IST
Bhatti Vikramarka Says Congress 80 Seats in Telangana Elections : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచి.. ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు కోసం, ఆత్మగౌరవం కోసం తెలంగాణను తెచ్చుకున్నామని.. వాటన్నింటినీ ప్రజలకు అందించడానికే ఆరు గ్యారెంటీలను మేనిఫెస్టోలో, అలాగే అనేక అంశాలు అందులో పొందుపరిచామని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర సంపదను ప్రజలకు పంచేందుకే తమ ఎజెండాగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. రాహుల్‌గాంధీ పిలుపుతో దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలో ప్రజలే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. సుమారు 80 సీట్లు గెలిచి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేఎల్‌ఆర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.