'ధనిక రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా మార్చిన బీఆర్‌ఎస్‌ను ఓడించాలి'
🎬 Watch Now: Feature Video
Bhatti Vikramarka Election Campaign at Madhira : రాష్ట్రంలో దొరలకు, ప్రజలకు మధ్య జరిగే ఎన్నికలు.. ధనిక రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా మార్చిన బీఆర్‌ఎస్‌ను ఓడించడానికే అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలోని పలు గ్రామాలో ఆయన ఎన్నికల ప్రచారం(Bhatti Vikramarka Election Campaign) నిర్వహించారు. భట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా మండలంలోని గ్రామాల ప్రజలు ఘనస్వాగతం పలికారు.
Bhatti Vikramarka Fires on BRS : దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన.. కేసీఆర్ ఆ పని చేయలేకపోయారని భట్టి విక్రమార్క విమర్శలు చేశారు. మూడెకరాల భూమి, ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆ హామీని నెరవేర్చలేకపోయారని ఆయన మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని.. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే పథకాలను అమలు చేస్తామని మాట ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా.. కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. రైతులకు రూ.15000, రైతుబంధు, ఉచిత విద్యుత్, పండిన పంటకు రూ.500 బోనస్, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.