Bhagyanagar Ganesh Utsava Committee Meeting : 'వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి' - వినాయక ఉత్సవాల కమిటీ మీటింగ్
🎬 Watch Now: Feature Video
Published : Aug 30, 2023, 9:21 PM IST
Bhagyanagar Ganesh Utsava Committee Meeting : రానున్న వినాయక చవితి ఉత్సవాలకు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు గణేష్ ఉత్సవ కమిటీ నాయకులు ఎన్వీ సుభాష్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కార్య నిర్వహణ అధికారి పల్లపు గోవర్దన్ తెలిపారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. గణేష్ ఉత్సవాల(Vinayaka Utsavalu)ను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాలని పల్లపు గోవర్దన్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా మండపాల విషయంలో.. పూజ నిర్వహణా అంశాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలకు వస్తున్న సమస్యలను అధిగమించేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా పూజా కార్యక్రమాల్లో చర్యలు తీసుకోవాలన్నారు. గణేశ్ మండపం వద్ద భద్రత కల్పించాలని.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.