ఈ నెల 13 నుంచి శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు - 23న ఉత్తరద్వార దర్శనం - సీతారాముల తెప్పోత్సవం
🎬 Watch Now: Feature Video
Published : Dec 6, 2023, 10:27 PM IST
Bhadrachalam Vaikunta Ekadasi 2023 : ఇవాళ భద్రాద్రి రామయ్య సన్నిధిలోని లక్ష్మణ సమేత సీతారాముల నిత్య కల్యాణ మూర్తులకు అభిషేకం నిర్వహించారు. ఈనెల 13 నుంచి జరగనున్న శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు రంగులు, చలువ పందిల్లు, విద్యుత్ దీపాలు అలంకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. రెండు రోజుల నుంచి చలి గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్న కారణంగా భద్రాద్రి రామయ్య సన్నిధికి వచ్చే భక్తుల రద్దీ తగ్గింది. ఈ కారణంగా ఆలయ ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి.
శ్రీ వైకుంఠ ఏకాదశి 2023 : ప్రతిరోజు బేడ మండపం వద్ద నిర్వహించే నిత్య కల్యాణం వేడుక వర్షం కారణంగా ప్రాకార మండపంలో నిర్వహించారు. ఈ నెల 22న సీతారాములకు గోదావరి నదిలో తెప్పోత్సవం వేడుక నిర్వహించనున్నారు. 23న శ్రీ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం వేడుకలు జరుపనున్నారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా అలంకరించడం వంటి పనులను తాత్కాలికంగా నిలిపివేశారు.