Bandi Sanjay On Telangana Formation Day : 'తొమ్మిదేళ్ల BRS పాలనలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు'
🎬 Watch Now: Feature Video
Bandi Sanjay Comments On Telangana Government : తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఏ ఒక్కరినీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నాలుగు కోట్ల జనాభా కోసం కేంద్ర ప్రభుత్వం రూ.4 లక్షల కోట్లు కేటాయిస్తే.. కేవలం నలుగురి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా వదిలేసిందని సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు కన్నీరు పెట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఒకవైపు తెలంగాణ సాధించుకున్నామని సంతోషం ఉన్నా.. మరోవైపు తెలంగాణలో తమకు న్యాయం జరగట్లేదని ప్రజలు మొరపెట్టుకుంటున్నారని మండిపడ్డారు.
Bandi On Telangana Formation Day : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన.. బీఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు గడిచినా.. బీఆర్ఎస్ పరిపాలనతో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదని మండిపడ్డారు. మహిళలు, యువత, రైతులను ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. ఉద్యోగ ఖాళీలను పూర్తి స్థాయిలో చేయాల్సిన ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.