Bandi Sanjay Bike Rally In Vemulawada : 'బండి సంజయ్ ఎక్కడ పోటీ చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది' - బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్
🎬 Watch Now: Feature Video
Published : Aug 26, 2023, 7:28 PM IST
Bandi Sanjay Bike Rally In Vemulawada : సీఎం కేసీఆర్ పంపిన బిల్లులపై న్యాయ సలహాలను గవర్నర్ కోరుతున్నారు కాబట్టే గవర్నర్ అంటే కేసీఆర్కు భయం పట్టుకుందని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. విలీనం పేరుతో ఆర్టీసీ కార్మికులను మోసం చేసేందుకు కేసీఆర్.. ఆ లోపాలను సరిచేసేందుకు గవర్నర్ పూనుకున్నారని పేర్కొన్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న తర్వాత బండి సంజయ్ కార్యకర్తలను ఉత్సాహపరచడానికి ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్నారు.
కేసీఆర్ రాక్షస పాలనతో తెలంగాణ ప్రజలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎంను తానే అవుతానంటూ ప్రచారం చేసుకోవడం సరికాదని హితవు పలికారు. అలాంటి వాళ్లంతా తన దృష్టిలో మూర్ఖులేనని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ రాక్షస పాలనను అంతం చేసి పేదల రాజ్యాన్ని స్థాపించడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. బండి సంజయ్ ఎక్కడ పోటీ చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని పార్టీ అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని బండి పేర్కొన్నారు .