Balakrishna at Thirunageswaram Naganathaswamy Temple Tamilnadu: తమిళనాడులో నందమూరి బాలకృష్ణ.. తిరునాగేశ్వరం నాగనాథస్వామి ఆలయ దర్శనం - actor balakrishna in tamilnadu
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-10-2023/640-480-19901238-thumbnail-16x9-balakrishna-at-thirunageswaram-naganathaswamy-temple-tamilnadu.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Oct 31, 2023, 10:04 AM IST
Balakrishna at Thirunageswaram Naganathaswamy Temple Tamilnadu: నందమూరి బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో ఎక్కడకు వెళ్లినా ఆయన అభిమానులు ఉంటారు. అదే విధంగా బాలకృష్ణ ఏ ప్రాంతానికి వెళ్లినా.. అక్కడ ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు దర్శిస్తుంటారు. తాజాగా తమిళనాడు వెళ్లిన బాలకృష్ణ.. అక్కడ తిరునాగేశ్వరం నాగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. దేవాలయం అధికారులు బాలకృష్ణకు ఘనంగా స్వాగతం పలికారు. అంతే కాకుండా బాలకృష్ణ అభిమానులతో కూర్చుని పూజ నిర్వహించారు.
ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తమిళనాడులోని తంజావురు జిల్లా కుంభకోణం సమీపంలోని తిరునాగేశ్వరం నాగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో.. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి పాలాభిషేకం చేశారు. పూజ జరుగతున్నంత సమయం స్వామి వారి ఎదుట ఇతర భక్తులతో పాటే కూర్చున్న బాలకృష్ణ.. ఎంతో భక్తి పారవశ్యంతో ఉన్నారు. పూజలు జరిగిన అనంతరం అర్చకులు వేదాశీర్వచనం అందించారు. పలువురు బాలకృష్ణతో ఫొటోలు తీసుకున్నారు.