మత్తులో చేతులు కాల్చుకున్న యువకుడు - వద్దని వారించిన కార్మికులపై దాడి - పటాన్‌చెరులో గంజా కేసు
🎬 Watch Now: Feature Video
Published : Dec 1, 2023, 2:14 PM IST
Attack on sanitation workers in Sangareddy : గంజాయి మత్తులో చేతులు కాల్చుకుంటున్న వ్యక్తిని వద్దని వారించినందుకు పారిశుద్ధ్య కార్మికులపై దాడి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శాంతినగర్ కాలనీలో ఎప్పటిలాగే పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ గుర్తు తెలియని యువకుడు మంటల్లో చేతులు కాల్చుకుంటున్నాడు అది చూసిన పారిశుద్ధ్య కార్మికులు అతన్ని ఎందుకు అలా చేస్తున్నావని వారించారు. అతణ్ని అగ్నికి దూరంగా జరిపే ప్రయత్నం చేశారు.
అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ఆ యువకుడు తొలుత పారిశుద్ధ్య కార్మికురాలు నాగలక్ష్మిపై దాడి చేశాడు. అడ్డుకోవడానికి వెళ్లిన మరో కార్మికుడు యాదగిరిని కూడా కర్రతో కొట్టాడు. ఈ క్రమంలో యాదగిరి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు యాదగిరి తలకు 10 కుట్లు వేశారు. నాగలక్ష్మికి స్వల్పంగా గాయపడ్డారు. మరోవైపు ఇదంతా గమనించిన స్థానికులు గంజాయి మత్తులో ఉన్న యువకుడిని కరెంటు స్తంభానికి కట్టేశారు. అనంతరం కార్మికులంతా కలిసి పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.