Apsara Parents Interview : 'అక్కయ్య అంటూ ఇంటికి వచ్చేవాడు.. ఇంత ఘోరం చేస్తాడనుకోలేదు' - అప్సర తల్లిదండ్రులతో ఈటీవీ భారత్ ఇంటర్వ్యూ
🎬 Watch Now: Feature Video
Apsara Murder Case In Hyderabad : నగరంలో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. సీరియల్ అవకాశాల కోసం వచ్చి.. ఇలా అతి కిరాతంగా హత్యకు గురి అవ్వడం అందరినీ విషాదంలోకి నెట్టేసింది. పూజారి సాయికృష్ణ ఎంతో జాగ్రత్తగా ఉన్నాసరే.. చివరికి నిజం బయటకు వచ్చింది. హత్య చేసి సెప్టిక్ ట్యాంక్‌లో ఆమెను పడేసి.. ఏమీ తెలియని అమాయకుడిలా నటించాడు.
తమ కూతురు అప్సరను చంపిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పోలీసులు న్యాయం చేయాలని కోరారు. నిందితుడి తండ్రి చేసిన ఆరోపణలను అప్సర తల్లి అరుణ ఖండించారు. అక్కయ్య అంటూ ఇంటికి వచ్చేవాడని.. ఇలా తన కుమార్తెను హత్య చేస్తాడని అనుకోలేదని అవేదన వ్యక్తం చేసింది. చివరిసారిగా తనకు, తల్లికి ఆరోగ్యం బాగోలేదని.. డబ్బులు పంపించమని ఫోన్ చేసినట్లు తండ్రి తెలిపాడు. ఈ నెల ఒకటో తేదీన అప్సరతో చివరిసారిగా మాట్లాడానంటున్న ఆమె తల్లిదండ్రులు శ్రీకర్, అరుణతో ఈటీవీ భారత్ ముఖాముఖి.