చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత.. టీడీపీ శ్రేణులపై పోలీసుల లాఠీఛార్జ్ - టీడీపీ నేతలపై లాఠీఛార్జ్
🎬 Watch Now: Feature Video
చంద్రబాబు ఏపీలోని కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయన పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. పర్యటనలో పాల్గొనడానికి బయల్దేరిన టీడీపీ కార్యకర్తలు, శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. శాంతిపురం మండలంలో నిర్వహించనున్న పర్యటనలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఎస్. గొల్లపల్లి నుంచి టీడీపీ శ్రేణులు బయలుదేరగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు టీడీపీ శ్రేణులపై లాఠీఛార్జ్ చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST