బీజేపీ అధికారంలోకి వస్తే, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : అమిత్ షా - అమిత్ షా వరంగల్ స్పీచ్
🎬 Watch Now: Feature Video
Published : Nov 18, 2023, 7:21 PM IST
Amit shah Election Campaign in Warangal : ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ.. బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ పలు దఫాలుగా రాష్ట్రానికి వచ్చి ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతంగా చేయగా.. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Amit Shaw).. సకల జనుల విజయ సంకల్ప సభ పేరుతో వరంగల్ జిల్లాలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అంటేనే అవినీతి లంచగొండి పార్టీ అని విమర్శించారు.
Amit shah Telangana Tour : మిషన్ భగీరథలో కుంభకోణాన్ని బీఆర్ఎస్(BRS) సర్కారే చేసింది అమిత్ షా ఆరోపించారు. మియాపూర్ భూముల కంభకోణాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టులో ముడుపులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడిందని అన్నారు. మద్యం కుంభకోణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేసిందని తెలిపారు. మిషన్ కాకతీయలో రూ. 22 వేల కోట్ల అవినీతి కుంభకోణానికి కేసీఆర్ ప్రభుత్వం పాల్పడిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు.
BJP Election Campaign in Telangana : ఓవైసీకీ భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదని అమిత్ షా ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17న అధికారికంగా జరుపుతామని తెలిపారు. ఓవైసీ ఒత్తిడికి లొంగి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చారని చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ కావడంతో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని విచారం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఆస్పత్రులు దారుణంగా ఉన్నాయని.. ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికి బాలుడు చనిపోయాడని గుర్తు చేశారు. త్వరలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. కేసీఆర్(KCR) అవినీతి కుంభకోణాలపై దర్యాప్తు చేసి.. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించి.. జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.