సిద్దిపేటలో 6 వేల లీటర్ల పాలు పారబోత - అసలు కారణం ఇదే - siddipet Adulterated Milk
🎬 Watch Now: Feature Video
Published : Dec 30, 2023, 3:37 PM IST
Adulterated Milk Scandal in Siddipet : సిద్దిపేట జిల్లా చేర్యాల పాలశీతలీకరణ కేంద్రంలో కల్తీ పాల విషయంలో కొన్నాళ్లుగా గొడవ జరుగుతుంది. ఇటీవల చేర్యాల నుంచి హైదరాబాద్ ప్రధాన కేంద్రానికి పాల ట్యాంకర్లు వెళ్లాయి. అక్కడ అధికారులు ట్యాంకర్లలోని పాలను పరిశీలించి, 6 వేల లీటర్లు కల్తీ పాలగా గుర్తించారు. పాల ట్యాంకర్లను వెనక్కి పంపించారు. ఇదివరకే ఇలాంటి ఘటన జరిగింది. మరోసారి అదే పరిస్థితి తలెత్తడంతో మేనేజర్‌తో గొడవకు దిగారు.
దీంతో పాల ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు స్థానిక మేనేజర్‌ను నిలదీశారు. పరీక్షలు చేయకుండా ఆరోపించడం సరికాదని, ఏ రోజుకారోజు పాలను పరీక్షించి కల్తీ ఉంటే ఆపేయాలని సూచించారు. పరీక్షలు చేయకుండా నిర్లక్ష్యం చేశారని, దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు పంపించిన పాలు తిరిగి వాపస్ రావడంతో వాటిని పారపోశారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని పాడి రైతులు వాపోతున్నారు. ఇకనైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.