ABVP Strike In Front Of Intermediate Board : ఇంటర్ బోర్డు ముట్టడికి ఏబీవీపీ ప్రయత్నం - ఏబీవీపీ ధర్నా
🎬 Watch Now: Feature Video
ABVP Strike In Front Of Intermediate Board : అధిక ఫీజులు వసూలు చేస్తూ.. అనధికారికంగా నడుపుతున్న కళాశాలల గుర్తింపు రద్దుచేయాలని ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని ఇంటర్మీడయట్ బోర్డు ముట్టడికి యత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు తొత్తుగా మారిందని... తొమ్మిదేళ్ళల్లో విద్యా వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా చేసిన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ, శ్రీకాంత్, ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
'తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తై 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేస్తూ విద్యా వ్యవస్థను పాతాళానికి తొక్కేస్తుంది. కార్పోరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్న నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తుంది. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి. నేను కేసీఆర్ని ఒకటే ప్రశ్నిస్తున్న దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నావ్ విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలను రోడ్డుకి ఈడ్చి నువ్వు ఏ ఘన కార్యం చేశావని దశాబ్ది ఉత్సవాలను జరుపుతున్నావు.'-చింతకాయల ఝాన్సీ, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి.