ప్రగతిభవన్‌ను ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు.. అడ్డుకున్న పోలీసులు - ఏబీవీపీ కార్యకర్తలు
🎬 Watch Now: Feature Video
TSPSC Paper Leackage: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో నేడు ప్రగతిభవన్ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు. ముట్టడికి ప్రయత్నించి ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేసి.. గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న కార్యకర్తలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారని ఏబీవీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంపై సీఎం కేసీఆర్ స్పందించాలని ఏబీవీపీ కార్యకర్తలు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శులను వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఈ లీకేజీకు నైతిక బాధ్యత వహిస్తూ.. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ విషయంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని సూచించారు. ఈ కేసు సిట్ నుంచి సీబీఐకు బదిలీ చేయాలన్నారు.