Auto Accident: స్కూల్ పిల్లల ఆటో బోల్తా.. ఒక్కరు మృతి.. ఇద్దరికి గాయాలు - rangareddy crime news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18293556-457-18293556-1681901899738.jpg)
Students auto an Accident in Shankar Palli: రంగారెడ్డి శంకర్ పల్లి శివారులో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల నుంచి పిల్లలతో వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శంకర్ పల్లికి చెందిన విద్యార్థులు.. సమీపంలో ఉన్న సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం బీడీఎల్ భానూరు డీఏవీ పాఠశాలలో చదువుతున్నారు. బస్సు సౌకర్యం లేకపోవటంతో తల్లిదండ్రులు ఓ ఆటోను ఏర్పాటు చేశారు. శంకర్ పల్లి నుంచి పిల్లలను పాఠశాలకు పంపుతుంటారు. ఈ క్రమంలోనే ఉదయం విద్యార్థులను తీసుకువెళ్లిన ఆటో.. మధ్యాహ్నం తిరిగి వస్తుండగా అదుపు తప్పింది. శంకర్ పల్లి సమీపంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లి, బోల్తా పడింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సంతోష్- బీనా దంపతుల కుమారుడు ఐదో తరగతి చదివే సీనా ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో 20మంది వరకు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించినందునే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఘటనపై శంకర్ పల్లి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.