Accident: మద్యం మత్తులో కార్ డ్రైవ్ చేశాడు.. కట్ చేస్తే..! - డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష
🎬 Watch Now: Feature Video
Accident in Hyderabad: మద్యం మత్తులో వాహనం నడపటంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జగద్గిరిగుట్టకు చెందిన నాగ ప్రశాంత్.. కేపీహెచ్‌బీ కాలనీలో ఓ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి విధులు ముగించుకొని నాగ ప్రశాంత్ తన బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఏపీ 28 ఏఆర్ 2269 నంబర్ గల ఇన్నోవా కారు స్పీడ్‌గా వచ్చి వెనుక నుంచి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన నాగ ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ రోడ్డు ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు డ్రైవర్ భూపతిని అదుపులోకి తీసుకున్నారు. అతడికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా.. మద్యం సేవించినట్టు తేలింది. మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.