కరెంట్ స్తంభం ఎక్కి వ్యక్తి హల్చల్- రెండు గంటలు నిలిచిపోయిన రైళ్లు - రైల్వేస్టేషన్లో కరెంట్ పోల్ ఎక్కిన వ్యక్తి
🎬 Watch Now: Feature Video
Published : Nov 28, 2023, 5:41 PM IST
A Man Climbs Electricity Pole in Maharashtra : మహారాష్ట్రలోని నందూర్బార్ రైల్వే స్టేషన్లో మతిస్తిమితం సరిగా లేని ఓ వ్యక్తి కరెంట్ స్తంభం ఎక్కి హల్చల్ చేశాడు. ఈ విషయాన్ని గమనించిన అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. దీంతో రెండు గంటలు పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
రైల్వే పట్టాలపై ఉండే హైటెన్షన్ పోల్ పైకి మతిస్తిమితం సరిగా లేని వ్యక్తి ఎక్కి అటు ఇటూ తిరుగుతూ బీభత్సం సృష్టించాడు. అధికారులు ఎంత ప్రయత్నించినా గంటపాటు కిందకు దిగలేదు. తర్వాత సిబ్బంది ఎలాగోలా నచ్చచెప్పి నిచ్చెన సాయంతో అతడిని కిందకు తీసుకొచ్చారు. తర్వాత ఆసుప్రతికి తరలించారు.
ఆ వ్యక్తి చేసిన హంగామా కారణంగా రైల్వే స్టేషన్లో గంటపాటు విద్యుత్ సరఫరా నిలిపేయాల్సి వచ్చింది. దీంతో భుసావల్ - సూరత్ మధ్య పలు రైళ్లు రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు రెండు గంటల తర్వాత రైల్వే సేవలను పునరుద్ధరించారు.