'వేసవిలో అగ్నిప్రమాదాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం' - హైదరాబాద్ న్యూస్
🎬 Watch Now: Feature Video
అగ్నిమాపకశాఖ అధునాతన పరికరాలను సొంతం చేసుకుంటుంది. అగ్ని ప్రమాదం సంభవించినా.. లేకపోతే భవనాలు కూలిపోయినా, వరదలు తలెత్తినా బాధితులను రక్షించే విధంగా పరికరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. అందువల్ల వాటిని ఎదుర్కొనేందుకు అగ్నిమాపక శాఖ అన్ని విధాలుగా సన్నద్ధం అవుతోంది. ప్రజలు కూడా అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించే విధంగా వివిధ కార్యక్రమాలు చేపడుతోంది.
ఈ క్రమంలోనే ప్రతి బిల్డింగ్లో అగ్నిమాపక పరికరాలు ఉండేలా చూసుకోవాలని ఆ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఆ పరికరాలు ప్రాథమికంగా ఉపయోగపడతాయని.. ఇలాంటి పరికరాలు ఉపయోగించేలా ప్రత్యేక శ్రద్ద వహిస్తామని అగ్నిమాపక అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగితే కొన్ని ప్రదేశాల్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అలాంటి వాటి కోసం పరికరాలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ శాఖలో సిబ్బంది కొరత ఉంది. దాన్ని తగ్గించేందుకు ఆర్టీసీ సంస్థ డ్రైవర్‌లను తీసుకున్నారు. అందుబాటులో ఉన్న సిబ్బందితో ప్రస్తుతం వచ్చే సమస్యలను ఎదుర్కోడానికి సరిపోతుందని.. వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామంటున్న అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డితో ప్రత్యేక ముఖాముఖి..