6 Years Boy kidnap At Nirmal District : బాలుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నం... దేహశుద్ధి చేసిన స్థానికులు - నిర్మల్ జిల్లాలో 6 ఏళ్ల బాలుడి కిడ్నాప్‌కు యత్నం
🎬 Watch Now: Feature Video
Published : Sep 3, 2023, 7:52 AM IST
6 Years Boy kidnap At Nirmal District : ఆసుపత్రి ప్రాంగణంలో ఒంటరిగా ఆడుకుంటున్న బాలుడిని అపహరించేందుకు యత్నించిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ వైద్య ఉద్యోగిని తన ఆరేళ్ల కుమారుడి హర్షవర్దన్‌ను ఆసుపత్రికి వచ్చింది. తల్లి విధుల్లో ఉండగా బాలుడు ఆసుపత్రి ప్రాంగణంలో ఒంటరిగా ఆడుకుంటున్నాడు. అతడిని గమనించిన ఓ వ్యక్తి... శనివారం సాయంత్రం అతడిని అపహరించాడు. స్థానికులు గమనించి అతడిని వెంబడించారు. కొద్దిదూరం పారిపోయిన నిందితుడిని వివేక్ చౌక్ వద్ద పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం బాలుడిని కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితుడి గురించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ విషయమై పట్టణ సీఐ పురుషోత్తంచారి కేసు నమోదు చేశారు. బాలుడి వద్ద ఉన్న చరవాణిని ఎత్తుకెళ్లే ఆలోచనతో సదరు నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.