కొత్త అల్లుడికి సర్పైజ్​ - 300 రకాల వంటలతో విందు - అనకాపల్లిలో అల్లుడుకి ఆతిథ్యం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 11:32 AM IST

Updated : Jan 17, 2024, 11:45 AM IST

300 Types Food Items Arranged To Son In Law Due To Sankranthi: రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వృత్తి, విద్య, ఉద్యోగం కోసం ఎక్కడికో వెళ్లిన వారంతా పండగ జరుపుకోవడానికి సొంతూళ్లకు చేరుకుని ఉత్సాహంగా కుటుంబంతో కలిసి వేడుకలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి అనగానే కొత్త అల్లుళ్లు అత్తవారింటికి రావటం, కుటుంబంతో సంతోషంగా గడపటం, భార్య తరపు వారి నుంచి మర్యాదలు స్వీకరించటం జరుగుతుంటాయి. ఈవిధంగా కొత్త అల్లుడికి మర్యాదలు, రకరకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి సంతృప్తి పరచటంలో గోదారోళ్లకు ఎవరూ సాటి లేరని చెప్తుంటారు. కానీ మర్యాదలు చేయటంలో మేము ఏమి తక్కువ కాదంటూ 300 రకాల పిండివంటలతో ఆతిథ్యం ఏర్పాటు చేశారు అనకాపల్లి జిల్లాకు చెందిన దంపతులు.

అనకాపల్లికి  చెందిన రిషితకు, విశాఖపట్నంకు చెందిన జ్యూవలరీ షాప్ యజమాని పసుమర్తి దేవేంద్రనాథ్​కు గత ఏడాది డిసెంబర్ 15వ వివాహం జరిగింది. తొలి పండుగకు కుమార్తె, అల్లుడు ఇంటికి రావడంతో రిషిత కుటుంబసభ్యులు సంప్రదాయం ఉట్టిపడేలా వివిధ రకాల పిండి వంటకాలను తయారు చేసి, విందు ఏర్పాటు చేశారు. ప్రేమగా అల్లుడికి వడ్డించి, నూతన దంపతులకు తినిపించి మురిసిపోయారు. 300 రకాల పిండి వంటకాలు తయారుచేసి అల్లుడికి మర్యాద చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది. 

Last Updated : Jan 17, 2024, 11:45 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.