కెనడాను కమ్మేసిన మంచు తుపాను - Snow storms are causing panic in many parts of Canada
🎬 Watch Now: Feature Video
కెనడాలోని పలు ప్రాంతాల్లో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. పెనుగాలులు, ఎడతెగని మంచు వర్షంతో న్యూ ఫౌండ్ లాండ్, లాబ్రెడార్‌లో అత్యవసర స్థితి ప్రకటించారు. వ్యాపారులు దుకాణాలు తెరవరాదని, వాహనాలతో రహదారులపైకి రావద్దని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. హిమపాతం కారణంగా పలు వాహనాలు మంచులో చిక్కుకుపోయాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. శనివారం మంచు తుపాను మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని కెనడా వాతావరణ శాఖ హెచ్చరించింది.